కుల్దీప్ మ్యారేజ్‌ లీవ్‌.. రెండో టెస్టుకు దూరం!

Published on Fri, 11/14/2025 - 11:32

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కానున్నాడు. నవంబర్ చివరి వారంలో కుల్దీప్ వివాహం జరగనుంది. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. కుల్దీప్ తన పెళ్లికి సెలవు మంజారు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని కుల్దీప్ అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. సఫారీలతో తొలి టెస్టు తర్వాత తనను జట్టు నుంచి కుల్దీప్‌ను రిలీజ్ చేసే అవకాశముంది.

"కుల్దీప్ వివాహం నవంబర్ చివరి వారంలో జ‌ర‌గ‌నుంది. అత‌డు సెలవు మంజూరు చేయాలని బోర్డును అభ్య‌ర్దించాడు. అయితే షెడ్యూల్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అత‌డికి ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా ఏడాది జూన్‌లో తన  చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో యాదవ్ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణయించుకున్నప్పటికి..  ఐపీఎల్ ముగింపు ఆల‌స్యం కావ‌డంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

అతడికి బీసీసీఐ సెలవు మంజారు చేస్తే నవంబర్‌ 22 నుంచి జరగనున్న రెండో టెస్టుకు కుల్దీప్‌ దూరమయ్యే అవకాశముంది. అతడి తిరిగి వన్డే సిరీస్‌కు భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ప్ర‌స్తుతం కుల్దీప్ ఈడెన్‌ గార్డెన్స్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టుకు భార‌త ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. 

క్విక్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఈడెన్‌ వికెట్‌పై కుల్దీప్‌ మ్యాజిక్‌ చేసే అవకాశముంది. అంతకుముందు విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ కుల్దీప్‌ 12 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్‌..
 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)