Breaking News

షేన్ వార్న్ నా హీరో.. ఇప్ప‌టికీ నేను బాధ‌ప‌డుతునే ఉన్నా: కుల్దీప్‌

Published on Fri, 08/23/2024 - 16:11

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్ శుక్రవారం ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏంసీజీలో ఏర్పాటు చేసిన దివంగత ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్ విగ్రహం ముందు కుల్దీప్‌ నివాళులర్పించాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశాడు. షేన్ వార్న్ బౌలింగ్‌లో ఎప్ప‌టికి ఒక అద్భుతం అంటూ కుల్దీప్ క్యాప్ష‌న్‌గా ఇచ్చాడు. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన కుల్దీప్‌.. వార్న్‌తో త‌నకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

"షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెట‌ర్‌. షేన్ నా హీరో. అత‌డితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వార్నీని గుర్తుచేసుకునే ప్ర‌తీసారి నేను భావోద్వేగానికి లోనవుతాను. నా కుటుంబంలోని ఒకరిని నేను కోల్పోయినట్లు ఇప్ప‌టికీ అనిపిస్తుందని" కుల్దీప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పేర్కొన్నాడు. 

ఇక కుల్దీప్ యాద‌వ్ ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనంత‌రం అత‌డు దులీప్ ట్రోఫీలో ఆడ‌నున్నాడు. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ Aకు కుల్దీప్ ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. ఆ త‌ర్వాత వ‌రుస టెస్టు సిరీస్‌ల‌తో కుల్దీప్ బీజీబీజీగా గ‌డ‌ప‌నున్నాడు. కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ను భార‌త్ సొంతం చేసుకోవ‌డంలో కుల్దీప్‌ది కీల‌క పాత్ర‌.

 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు