ICC Rankings: సత్తాచాటిన కుల్దీప్‌ యాదవ్‌.. కెరీర్‌లోనే తొలిసారి

Published on Thu, 10/16/2025 - 09:38

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌(Kuldeep Yadav) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరాడు. న్యూఢిల్లీ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్న లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ (683 పాయింట్లు) 7 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరాడు. 

టీమిండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా (882 పాయంట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ (726 పాయింట్లు) 12వ ‘ప్లేస్‌’లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (753 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని భారత్‌ తరఫున అత్యుత్తమంగా ఐదో ర్యాంక్‌ కు చేరుకున్నాడు. పంత్‌ (753 పాయింట్లు) 8వ స్థానంలో ఉన్నాడు.

వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తిరిగి అగ్రస్థానానికి చేరాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 11 వికెట్లతో సత్తా చాటిన రషీద్‌ ఖాన్‌ ఐదు స్థానాలు ఎగబాకి 710 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌ గిల్‌ (784 పాయింట్లు) ‘టాప్‌’లోనే ఉన్నాడు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్న‌ర్‌కు నో ఛాన్స్‌?

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)