Breaking News

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. శ్రీకర్‌ భరత్‌ను సన్మానించనున్న ఏసీఏ

Published on Thu, 02/01/2024 - 09:33

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఆంధ్ర కెప్టెన్‌గా రాణించిన శ్రీకర్‌ భరత్‌.. తన హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు. వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో సత్తాచాటాలని భరత్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో సొంత గడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతున్న భరత్‌ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. 

"వైజాగ్‌ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన శ్రీకర్‌ భరత్‌ను ఘనంగా సన్మానించనున్నాం. ఈ కార్యక్రమం గురువారం స్టేడియంలో నిర్వహించనున్నాం. ఇది అతడి విజయానికి దగ్గిన గౌరవం" అని న్యూస్‌ 18తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

బాల్‌ బాయ్‌ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా..
కేఎస్‌ భరత్‌ క్రికెట్‌ జర్నీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంతోనే ప్రారంభమైంది. 2005లో బాల్ బాయ్‌గా ఎక్కడైతే పనిచేశాడో.. అదే స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. తద్వారా సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా భరత్‌ నిలవనున్నాడు. ఈ జాబితాలో 

భరత్‌ కంటే ముందు ఆంధ్ర దిగ్గజ ప్లేయర్‌ సీకే నాయుడు మొదటి ఆటగాడిగా ఉన్నారు. ఎమ్‌ఎస్‌కె ప్రసాద్‌,  హనుమ విహారి భారత్‌ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ..  సొంతగడ్డపై ఆడే ఛాన్స్‌ రాలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)