Breaking News

సిరాజ్‌.. నీకు అసలు బుద్ది ఉందా..?

Published on Tue, 12/10/2024 - 17:49

అడిలైడ్‌ టెస్ట్‌ సందర్భంగా టీమిండియా పేసర్‌ మొహహ్మద్‌ సిరాజ్‌- ఆసీస్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ మధ్య జరిగిన ఫైట్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు సిరాజ్‌ అతి చేశాడని అంటుంటే, మరికొందరు హెడ్‌ను తప్పుబడుతున్నాడు. ఏదిఏమైనప్పటికీ ఐసీసీ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. హెడ్‌కు ఓ డీ మెరిట్‌ పాయింట్‌ ఇవ్వగా.. సిరాజ్‌కు డీ మెరిట్‌ పాయింట్‌తో పాటు 20 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత పడింది.

సిరాజ్‌-హెడ్‌ గొడవపై సోషల్‌మీడియాలో డిబేట్లు జరుగుతున్నప్పటికీ వారిద్దరూ మ్యాచ్‌ జరుగుతుండగానే రాజీ పడ్డారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నాడు. హెడ్‌ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అర్దం చేసుకున్నానని సిరాజ్‌ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ గొడవలో సిరాజ్‌ తప్పు ఎంతన్నది పక్కన పెడితే, అతని ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సిరాజ్‌ను తప్పుబట్టే వారిలో టీమిండియా మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ కూడా చేరిపోయాడు.

హెడ్‌ పట్ల సిరాజ్‌ది పిచ్చి ప్రవర్తన అని దుయ్యబట్టాడు. హెడ్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ సెంచరీ చేసినందుకు అభినందించాల్సి పోయి అతనితో వాగ్వాదానికి దిగడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ శ్రీకాంత్‌ ఇలా అన్నాడు.

హే సిరాజ్‌.. హెడ్‌ నీ బౌలింగ్‌ను నిర్దాక్షిణ్యంగా ఛేదించాడు. అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించాడు. నీ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సర్లు అలవోకగా కొట్టగలిగాడు. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి.. అతనికి సెండ్‌ ఆఫ్‌ ఇస్తావా..? అసలు నీకు బుద్ధి ఉందా..? పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు. దీన్ని స్లెడ్జింగ్ అంటారా? ఇది కేవలం పిచ్చి మాత్రమే అని అన్నాడు.

హెడ్‌ను అగౌరవపరిచినందుకు శ్రీకాంత్‌  సిరాజ్‌ను లెఫ్ట్ అండ్‌ రైట్ వాయించాడు. భారత బౌలర్ల పట్ల, ముఖ్యంగా అశ్విన్ లాంటి అనుభవజ్ఞుల పట్ల హెడ్‌ నిర్భయ విధానాన్ని మెచ్చుకున్నాడు.

శ్రీకాంత్‌ మాటల్లో.. "ఓ బ్యాటర్ 140 పరుగులు చేశాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాలి. అతని నాక్‌ను మెచ్చుకోవాలి. అలా చేయాల్సింది పోయి అగౌరవపరిచే రీతిలో సెండ్‌ ఆఫ్‌ ఇస్తావా..? నువ్వు హెడ్‌ను సున్నా పరుగులకో లేక పది పరుగులకో ఔట్‌ చేసి ఉంటే అది వేరే విషయం. 

నువ్వు ఏదో ప్లాన్‌ చేసి అతని వికెట్‌ తీసినట్లు సంబురపడిపోయావు.  అతను నీ బౌలింగ్‌ను ఎడాపెడా వాయించిన విషయం ఎలా మరిచిపోతావు..? హెడ్‌ విరుచుకుపడుతుంటే ఏ ఒక్క భారత బౌలర్‌ దగ్గర సమాధానం‍ లేదు. అతను ఇష్టారీతిన సిక్సర్లు కొట్టాడు. అతను అశ్విన్‌ అసలు స్పిన్నర్‌గా గుర్తించలేదు. వికెట్లు వదిలి ముందుకు వచ్చి అలవోకగా సిక్సర్లు బాదాడు"

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)