Breaking News

క్రిష వర్మ పసిడి పంచ్‌

Published on Sun, 11/03/2024 - 04:15

న్యూఢిల్లీ: అండర్‌–19 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్‌ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్‌ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్‌ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్‌ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది. 

మహిళల విభాగంలో చంచల్‌ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్‌ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్‌ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు. 

మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్‌ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్‌ (ఇంగ్లండ్‌) చేతిలో... 70 కేజీల ఈవెంట్‌లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్‌డలె (ఇంగ్లండ్‌) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్‌ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్‌ (అమెరికా) చేతిలో ఓడాడు.

శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్‌ బాక్సింగ్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)