Breaking News

వారిద్దరూ జట్టులో ఎందుకు? గంభీర్‌పై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published on Sat, 07/25/2026 - 15:56

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భార‌త మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ మ‌రోసారి ఘూటు వ్యాఖ్య‌లు చేశారు. కోచ్‌గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. శివం దూబే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను మేనెజ్‌మెంట్‌ ఆల్‌రౌండర్లుగా ప‌రిగ‌ణించ‌డం ప‌ట్ల శ్రీకాంత్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 

"శివ‌మ్‌ దూబే, హర్షిత్ రాణాలను ఆల్‌రౌండర్లుగా పరిగ‌ణించ‌లేం. ఒక‌వేళ వారిద్ద‌రిని ఆల్‌రౌండ‌ర్లు అంటే నేను కూడా గొప్ప ఆల్‌రౌండ‌ర్‌ అని చెప్పుకోవ‌చ్చు. హార్దిక్ పాండ్యా ఒక్క‌డే అస‌లైన ఆల్‌రౌండ‌ర్‌. 

నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్‌రౌండర్. అత‌డు 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడు. ఇప్ప‌టికైనా మేనెజ్‌మెంట్ స‌రైన ఆల్‌రౌండ‌ర్ల‌ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని" శ్రీకాంత్ పేర్కొన్నారు. అదేవిధంగా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ కచ్చితంగా వన్డే ప్రపంచకప్‌ జట్టులో ఉండాలని ఆయన సూచించారు.

కాగా యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోవడంతో గంభీర్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ టీమిండియా విఫలమైంది. జట్టులో హార్దిక్‌ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. శివమ్‌ దూబే ఉన్నప్పటికి ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.
చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వేటు

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)