ఈ జట్టుతో ప్రపంచకప్‌ గెలుస్తారా..? వారిద్దరిని ఎందుకు ఎంపిక చేశారు?

Published on Fri, 08/29/2025 - 11:49

ఆసియాకప్‌-2025కు ఎంపిక చేసిన భారత జట్టుపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైశ్వాల్‌ వంటి స్టార్‌ ప్లేయర్లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు.

తాజాగా సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్‌ కృష్ణమచారి శ్రీకాంత్‌ విమర్శలు గుప్పించాడు. హర్షిత్‌  రాణా, రింకూ సింగ్‌లను ఏ ప్రాతిపాదికిన ఎంపిక చేశారని శ్రీకాంత్‌ ప్రశ్నించాడు. కాగా రింకూ, హర్షిత్‌ రాణాలు ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఐపీఎల్‌-2025లో కూడా అంతంత మాత్రమే రాణించారు. అయినప్పటికి సెలక్టర్లు వారికి ఛాన్స్‌ ఇవ్వడం అందరిని ఆశ్యర్యపరిచింది.

"ఆసియాకప్‌ గెలవడానికి సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టు సరిపోవచ్చు. కానీ ఈ జట్టుతో టీ20 ప్రపంచ కప్ గెలిచే అవకాశం లేదు. టీ20 వరల్డ్‌కప్‌కు కేవలం ఇంకా ఆరు నెలల మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నమెంట్‌కు మీ సన్నహకాలు ఇవేనా?  సెలక్టర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు  వింతంగా అన్పించాయి. 

రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, హర్షిత్‌ రాణాలను ఎందుకు ఎంపిక చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. ఐపీఎల్‌ను ప్రమాణాకంగా తీసుకుని ఎంపిక చేయొచ్చు.. కానీ మనకు నచ్చిన ఆటగాళ్లను మాత్రం సెలక్ట్‌ చేయకూడదు. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాము. 

ఐదవ స్ధానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? హార్దిక్ సాధారణంగా ఆ స్దానంలో బ్యాటింగ​ వస్తాడు. మరి అక్షర్‌ పటేల్‌ పరిస్థితి ఏంటి? అక్షర్‌ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడని నేను అనుకోవడం లేదు. ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్ రెండింటిలోనూ తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడిని కాదని దూబేను ఎంపిక చేయడం వెనక ఉన్న తర్కం నాకు అర్థం కాలేదు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)