వింబుల్డన్‌ సెమీస్‌లో ఉక్రెయిన్‌ సంచలనం

Published on Wed, 07/08/2026 - 22:22

వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఉక్రెయిన్ సంచ‌ల‌నం మార్తా కొష్ట్యుక్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. బుధ‌వారం మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో 12వ సీడ్‌ కొష్ట్యుక్ 6-3, 6-2తో ఇట‌లీకి చెందిన 13వ సీడ్ జాస్మిన్ ప‌వోలినిను మ‌ట్టిక‌రిపించింది. కేవ‌లం గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కొష్ట్యుక్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. 

రెండు సెట్ల‌లోనే మ్యాచ్‌ను కైవ‌సం చేస‌కున్న కొష్ట్యుక్ 3 ఏస్‌లు సంధించ‌డంతో పాటు 19 విన్న‌ర్లు కొట్ట‌గా, ప‌వోలిని 8 విన్న‌ర్ల‌కే ప‌రిమిత‌మైంది. 26 అన‌వ‌స‌ర త‌ప్పిదాల‌తో ప‌వోలిని మూల్యం చెల్లించుకుంది. మ‌రో క్వార్టర్స్‌లో లిండా నొస్కోవా (చెక్ రిప‌బ్లిక్‌) 6-3, 7-5తో ఎలిస్ మెర్టిన్స్ (బెల్జియం)పై సునాయాస విజ‌యం సాధించి సెమీస్ చేరుకుంది. 


లిండా నొస్కోవా

గురువారం జ‌ర‌గ‌నున్న సెమీస్‌లో గాఫ్‌తో ముచ్కోవా, కొష్ట్యుక్‌తో నొస్కోవా త‌ల‌ప‌డ‌నున్నారు. గ‌త 22 మ్యాచ్‌ల్లో ఒక్క ఓట‌మి మాత్ర‌మే చ‌విచూసిన కొష్ట్యుక్‌కు మేజ‌ర్ టోర్నీల్లో ఇది వ‌రుస‌గా రెండో సెమీఫైన‌ల్‌కు చేరుకోవ‌డం విశేషం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైన‌ల్లో మిర్రా ఆండ్రీవా చేతిలో కొష్ట్యుక్ ఓట‌మి చ‌విచూసింది. 

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)