Breaking News

బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్‌పాట్‌

Published on Tue, 04/01/2025 - 13:09

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్‌ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్‌ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్‌ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. కొన్‌స్టాస్‌తో పాటు వివాదాస్పద బౌలింగ్‌ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్‌, ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ కూడా కొత్తగా క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందారు. 

ఈ ముగ్గురి చేరికతో క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్‌స్టాస్‌, కుహ్నేమన్‌, వెబ్‌స్టర్‌ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్‌ పొందారు. కొన్‌స్టాస్‌, వెబ్‌స్టర్‌ భారత్‌తో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్‌ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో కుహ్నేమన్‌ 2 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్‌ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది. 

కొన్‌స్టాస్‌ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్‌ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ను ఎదుర్కొని హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత కొన్‌స్టాస్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్‌ అయ్యాడు.

వెబ్‌స్టర్‌ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్‌స్టర్‌ కూడా తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్‌ మార్ష్‌, కెమారూన్‌ గ్రీన్‌ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్‌ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పట్టాడు.

2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆసీస్‌ ఆటగాళ్లు..
పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్‌స్టాస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్నస్ లబూషేన్‌, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్‌లెట్

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)