Breaking News

KKR Vs PBKS: కోల్‌‘కథ’ మారేనా!

Published on Sat, 04/26/2025 - 03:24

కోల్‌కతా: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయిన జట్లు... 18వ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇలా నాలుగు జట్లు చక్కటి ఆటతీరుతో దూసుకెళ్తున్నాయి. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్‌ నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో తలపడనుంది. 

గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన కెప్టెన్    శ్రేయస్‌ అయ్యర్‌... ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా ఈడెన్‌ గార్డెన్స్‌లో అడుగు పెట్టనున్నాడు. పుష్కర కాలం తర్వాత కేకేఆర్‌కు మూడో ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను ఫ్రాంఛైజీ వేలానికి వదిలేస్తే... పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకొని కెప్టెన్‌ను చేసింది. కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి శ్రేయస్‌ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. 

ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌ 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 95 పరుగులకు ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్‌కతా చూస్తుంటే... గెలుపు జోరు కొనసాగిస్తూ ‘ప్లే ఆఫ్స్‌’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని పంజాబ్‌ భావిస్తోంది.  

మిడిలార్డర్‌పైనే భారం! 
డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోల్‌కతా... నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన కోల్‌కతా పట్టిక ఏడో స్థానంలో ఉంది. కెపె్టన్‌ అజింక్యా రహానే ఒక్కడే ఓ మాదిరిగా ఆడుతుండగా... మిగిలిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. 8 మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేసిన రహానే జట్టులో అందరికంటే ముందున్నాడు. 19 ఏళ్ల అంగ్‌క్రిష్‌ రఘువంశీ 197 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 

కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌... 135 పరుగులే చేయగా... ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ 143, సునీల్‌ నరైన్‌ 147 కూడా మెరుపులు మెరిపించలేకపోతున్నారు. రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్‌ సింగ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రింకూ 8 మ్యాచ్‌ల్లో 133 పరుగులే చేయగా... రసెల్‌ 55, రమణ్‌దీప్‌ 30 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఫినిషింగ్‌ టచ్‌తో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తారనుకుంటే... వారు వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. బౌలింగ్‌లోనూ కేకేఆర్‌కు ఏదీ కలిసి రావడం లేదు. 

వరుణ్‌ చక్రవర్తి, నరైన్, మోయిన్‌ అలీ వంటి ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నప్పటికీ పిచ్‌ వారికి అనుకూలంగా రూపొందించుకోలేక పోయిన కేకేఆర్‌ దానికి మూల్యం చెల్లించుకుంటోంది. పేసర్లు వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా ఫర్వాలేదనిపిస్తున్నారు. కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు కోల్‌కతా సిద్ధమైంది.  

అన్నీ రంగాల్లో బలంగా... 
కేకేఆర్‌తో పోల్చుకుంటే పంజాబ్‌ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ సీజన్‌లో శ్రేయస్‌ సారథ్యం... పాంటింగ్‌ వ్యూహాలు... ఓపెనర్ల మెరుపులు... చాహల్‌ స్పిన్‌ మాయాజాలం వెరసి పంజాబ్‌ బలంగా కనిపిస్తోంది. లీగ్‌ ఆరంభంలో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయస్‌... గత మూడు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడం కాస్త ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ అతడు 8 మ్యాచ్‌ల్లో 263 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. 

ప్రియాన్ష్ఆర్య 254, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 209, నేహల్‌ వధేరా 189, శశాంక్‌ సింగ్‌ 158 పరుగులు చేశారు. ఓపెనర్లు ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తుండగా... శ్రేయస్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌ మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నారు. బౌలింగ్‌లో ప్రధాన పేసర్‌ అర్‌‡్షదీప్‌ సింగ్‌ ఆకట్టుకుంటుండగా... యుజ్వేంద్ర చాహల్‌ ఫామ్‌లో ఉన్నాడు. 

అర్ష్ దీప్ 11 వికెట్లు తీయగా... కేకేఆర్‌తో గత మ్యాచ్‌లో చాహల్‌ 4 ప్రధాన వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న పంజాబ్‌కు మార్కో యాన్సెన్, స్టొయినిస్‌ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్లు ఉండటం అదనపు బలంగా మారింది. ఈ ఇద్దరు మంచి టచ్‌లో ఉన్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్‌... పంజాబ్‌ జోరును ఎలా అడ్డుకుంటుందో చూడాలి!

34 ఐపీఎల్‌ చరిత్రలో కోల్‌కతా, పంజాబ్‌ జట్లు ముఖాముఖిగా 34 సార్లు తలపడ్డాయి. 21 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, 13 మ్యాచ్‌ల్లో పంజాబ్‌ గెలుపొందాయి. పంజాబ్‌పై కోల్‌కతా అత్యధిక స్కోరు 261 కాగా, అత్యల్ప స్కోరు 95 పరుగులు. కోల్‌కతాపై పంజాబ్‌ అత్యధిక స్కోరు 262 కాగా, అత్యల్ప స్కోరు 111 పరుగులు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)