Breaking News

KKR vs CSK: నిలవాలంటే గెలవాలి

Published on Wed, 05/07/2025 - 01:45

కోల్‌కతా: డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భవితవ్యం ఈ మ్యాచ్‌లో తేలనుంది. ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేసులో కోల్‌కతా ఉంటుందా లేదంటే లీగ్‌తోనే సరిపెట్టుకుంటుందా అనే విషయం నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంది. మరోవైపు ధోని బృందం ఇది వరకే లీగ్‌ నుంచి ని్రష్కమించింది. అయితే ఐపీఎల్‌ కెరీర్‌ చరమాంకంలో ఉన్న ధోని ఆటతీరును, లోయర్‌ఆర్డర్‌లో క్రీజులోకి వస్తున్న తీరును పరిశీలిస్తే ఈ సీజనే చివరిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే... భారత విఖ్యాత స్టేడియం ఈడెన్‌ గార్డెన్స్‌లో తాను ఆడే ఆఖరి పోరును ధోని చిరస్మరణీయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి నామమాత్రమైనా... నైట్‌రైడర్స్‌కు కీలకమైన ఈ పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం.  

బ్యాటింగే కోల్‌కతా బలం 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు బ్యాటింగే బలం. ఇప్పటికే ఈ సీజన్‌లో నాలుగుసార్లు 200 పైచిలుకు పరుగుల్ని సాధించింది. లక్నోతో ఎదురైనా 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ నైట్‌రైడర్స్‌ 4 పరుగుల తేడాతోనే ఓడింది. దీన్నిబట్టి చెప్పొచ్చు కోల్‌కతా బ్యాటర్ల బలమెంతో! తొలిదశను పక్కన బెడితే గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన 200 ప్లస్‌ స్కోరు కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు ఎంత కష్టపడుతుందో సూచిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్‌ రాయల్స్‌లతో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఏ ఒక్కరి విధ్వంసంతోనూ, ఒకరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లతోనూ అంతపెద్ద స్కోరు సాధ్యమవలేదు. 

బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంతా మూకుమ్మడిగా రాణించింది. గుర్బాజ్, కెపె్టన్‌ అజింక్య రహానే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, రసెల్‌ అందరూ బ్యాట్‌లకు పని చెప్పారు. ఇక అంతకుముందు ఢిల్లీతో జరిగిన పోరులో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ సాధించలేదు. అయినాసరే టాపార్డర్‌ 20 ప్లస్‌ స్కోర్లు, రింకూ సింగ్‌ (36), టాప్‌స్కోరర్‌ రఘువంశీ (44) చేసిన పరుగులతోనే కోల్‌కతా సులువుగా 200 పైచిలుకు స్కోరును సాధించింది. బౌలింగ్‌లోనూ వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ల స్పిన్‌ మ్యాజిక్‌ ప్రత్యర్థులను చుట్టేస్తుంది. వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణాలు తమ పేస్‌ బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమష్టి ప్రదర్శన సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో కనబరిస్తే కోల్‌కతాకు ఎదురే ఉండదు.   

చెన్నైకిది చేదు సీజన్‌  
ఐపీఎల్‌కే వన్నెతెచ్చిన టీమ్‌లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్‌లలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే). 5 టైటిల్స్‌తో ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ... పదిసార్లు ఫైనల్‌ చేరిన (5సార్లు రన్నరప్‌) ఏకైక జట్టు సీఎస్‌కే. లీగ్‌ చరిత్రలో ఇంతటి ఘనచరిత్ర కలిగిన ధోని జట్టుకు ఈ సీజన్‌ అత్యంత చెత్తగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడితే రెండంటే రెండే మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏకంగా 9 పరాజయాలతో లీగ్‌ నుంచి ని్రష్కమించిన సూపర్‌కింగ్స్‌కు మిగిలిందల్లా మిగతా మ్యాచ్‌లు ఆడి గెలవడమే! జోరు మీదున్న కోల్‌కతాను ఆపుతుందా... మరో భంగపాటుతో అట్టడునే నిలుస్తుందో చూడాలంటే చీకటి పడేదాకా ఆగాల్సిందే!

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)