Breaking News

సీఎస్‌కేకు బై బై.. కేకేఆర్‌ మెంటార్‌గా వెస్టిండీస్‌ లెజెండ్‌

Published on Fri, 09/27/2024 - 10:50

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు కొత్త మెంటార్ వ‌చ్చేశాడు. త‌మ జ‌ట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గ‌జం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మెనెజ్‌మెంట్ నియ‌మించింది.  గ‌త రెండు సీజ‌న్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా ప‌నిచేసిన బ్రావో.. ఇప్పుడు కేకేఆర్‌తో జ‌తక‌ట్టాడు. 

గ‌త సీజ‌న్‌లో కోల్‌క‌తా మెంటార్‌గా ప‌నిచేసిన గౌతం గంభీర్ స్ధానాన్ని ఈ క‌రేబియ‌న్ లెజెండ్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని కేకేఆర్ అధికారికంగా ధ్రువీక‌రించింది. మా కొత్త మెంటార్‌, డిజే 'సర్ ఛాంపియన్‌' బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్‌ సిటీకి స్వాగతిస్తున్నాము కేకేఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.

నైట్‌రైడర్స్‌తో ప్రత్యేక బంధం..
కాగా బ్రావో ఐపీఎల్‌లో ఎప్పుడూ కేకేఆర్‌కు  ప్రాతినిథ్యం వహించినప్పటకి.. నైట్‌రైడర్స్ యాజమాన్యంతో అతడికి మంచి అనుబంధం ఉంది. 2013 నుంచి 2020 వరకు సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 సీజన్‌లో కూడా టీకేఆర్‌కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. కాగా కేకేఆర్, టీకేఆర్ ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం.

ప్రొఫెషనల్ క్రికెట్‌కు విడ్కోలు..
కాగా అన్ని రకాల క్రికెట్‌కు బ్రావో విడ్కోలు పలికాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని సీజన్ ఆరంభంలోనే వెల్లడించాడు. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ మధ్యలో గాయపడడంతో.. సీజన్ మొత్తం ఆడకుంటానే తన కెరీర్‌ను ముగించాడు.


 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)