Breaking News

IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్‌.. ఢిల్లీపై గ్రాండ్ విక్ట‌రీ

Published on Tue, 04/29/2025 - 23:39

ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తిరిగి పుంజుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. 205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫాఫ్ డుప్లెసిస్‌(62) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అక్ష‌ర్ ప‌టేల్‌(43) ఫ‌ర్వాలేద‌న్పించాడు.  వీరితో విప్ర‌జ్ నిగ‌మ్(19 బంతుల్లో 38) ఆఖ‌రిలో మెరుపులు మెరిపించ‌న‌ప్పటికి జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు, అనుకుల్ రాయ్‌,ర‌స్సెల్‌, ఆరోరా త‌లా వికెట్ సాధించారు. 

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(36), గుర్భాజ్‌(26), నరైన్‌(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.
చ‌దవండి: IPL 2025: వావ్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్‌! వీడియో వైర‌ల్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)