Breaking News

CSK Vs KKR: చెపాక్‌లో చెన్నై చిత్తుగా...

Published on Sat, 04/12/2025 - 03:29

ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో పరాజయం... మొదటిసారి సొంతగడ్డ చెపాక్‌ మైదానంలో వరుసగా మూడో ఓటమి... ధోని కెపె్టన్సీ పునరాగమనంలో సీఎస్‌కే మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) పదునైన బౌలింగ్‌ ముందు చేతులెత్తేసిన సీఎస్‌కే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫటాఫట్‌గా 61 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకున్న కోల్‌కతా రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకొని దూసుకుపోయింది. 

చెన్నై: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సొంత మైదానంలో బ్యాటింగ్‌ వైఫల్యంతో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగింది. 

శివమ్‌ దూబే (29 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విజయ్‌శంకర్‌ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించాడు. అనంతరం కోల్‌కతా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు సాధించి గెలిచింది. సునీల్‌ నరైన్‌ (18 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) శుభారంభంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం జట్టు సొంతమైంది.  

పేలవ బ్యాటింగ్‌... 
ఓపెనర్లు కాన్వే (12), రచిన్‌ (4) ఒకే స్కోరు వద్ద వెనుదిరగ్గా... రెండు సార్లు అదృష్టం కలిసొచ్చిన విజయ్‌ శంకర్‌ కొన్ని పరుగులు రాబట్టాడు. 0, 20 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌లను నరైన్, వెంకటేశ్‌ అయ్యర్‌ వదిలేశారు. రాహుల్‌ త్రిపాఠి (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై 9 పరుగుల తేడాతో అశ్విన్‌ (1), జడేజా (0), దీపక్‌ హుడా (0), ధోని (1) వికెట్లను కోల్పోయింది. 

71/6 వద్ద బ్యాటింగ్‌ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో చెన్నై ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బ్యాటర్‌ హుడాను తీసుకు రాగా, అతనూ డకౌటయ్యాడు. వరుసగా 63 బంతుల పాటు జట్టు ఫోర్‌ కొట్టలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరో ఎండ్‌లో నిలబడిన దూబే తన 20వ బంతికి గానీ తొలి ఫోర్‌ కొట్టలేకపోయాడు. చివరి ఓవర్లో అతను మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఎట్టకేలకు స్కోరు 100 పరుగులు దాటింది.  

చకచకా లక్ష్యం వైపు... 
ఛేదనలో కోల్‌కతాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. క్వింటన్‌ డికాక్‌ (16 బంతుల్లో 23; 3 సిక్స్‌లు), నరైన్‌ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. ఖలీల్‌ ఓవర్లో డికాక్‌ 2 సిక్స్‌లు బాదగా, అశ్విన్‌ ఓవర్లో నరైన్‌ ఫోర్, సిక్స్‌ కొట్టాడు. ఖలీల్‌ తర్వాత ఓవర్లో కేకేఆర్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. 

ఆపై అశ్విన్‌ ఓవర్లో నరైన్‌ మరో 2 సిక్స్‌లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో నూర్‌ అహ్మద్‌ అతడిని అవుట్‌ చేసినా... అజింక్య రహానే (17 బంతుల్లో 20 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (12 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కలిసి పని పూర్తి చేశారు.   

ధోని అవుటా...నాటౌటా! 
ఎప్పటిలాగే అభిమానులు ఎదురు చూసేలా చేసీ చేసీ చివరకు 9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను నరైన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్‌ అవుట్‌గా ప్రకటించగా ఈ నిర్ణయంపై ధోని ‘రివ్యూ’ కోరాడు. బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో ‘స్నికో’లో కాస్త కదలిక కనిపించినా... టీవీ అంపైర్‌ వినోద్‌ శేషన్‌ దీనిని లెక్కలోకి తీసుకోకుండా అవుట్‌గా ఖాయం చేశాడు. దీనిపై ఫోర్త్‌ అంపైర్‌ తన్మయ్‌ శ్రీవాత్సవను కలిసి చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ తన అసంతృప్తిని ప్రదర్శించడం కనిపించింది.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి) రహానే (బి) హర్షిత్‌ 4; కాన్వే (ఎల్బీ) (బి) అలీ 12; త్రిపాఠి (బి) నరైన్‌ 16; విజయ్‌ శంకర్‌ (సి) అలీ (బి) వరుణ్‌ 29; శివమ్‌ దూబే (నాటౌట్‌) 31; అశ్విన్‌ (సి) అరోరా (బి) హర్షిత్‌ 1; జడేజా (సి) డికాక్‌ (బి) నరైన్‌ 0; హుడా (సి) అరోరా (బి) వరుణ్‌ 0; ధోని (ఎల్బీ) (బి) నరైన్‌ 1; నూర్‌ (సి) వరుణ్‌ (బి) అరోరా 1; అన్షుల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–59, 4–65, 5–70, 6–71, 7–72, 8–75, 9–79. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–31–1, మొయిన్‌ అలీ 4–1–20–1, హర్షిత్‌ రాణా 4–0–16–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–22–2, సునీల్‌ నరైన్‌ 4–0–13–3.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) అన్షుల్‌ 23; నరైన్‌ (బి) నూర్‌ 44; రహానే (నాటౌట్‌) 20; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10.1 ఓవర్లలో 2 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–46, 2–85. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–40–0, అన్షుల్‌ 2–0–19–1, అశ్విన్‌ 3–0–30–0, నూర్‌ 2–0–8–1, జడేజా 0.1–0–9–0.  

ఐపీఎల్‌లో నేడు
లక్నో x  గుజరాత్‌ 
వేదిక: లక్నో
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి 
హైదరాబాద్‌ x  పంజాబ్‌  
వేదిక: హైదరాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)