Breaking News

T20 WC: టీమిండియా గెలవాలంటే అతడు జట్టులో ఉండాల్సిందే!

Published on Fri, 03/15/2024 - 15:28

విరాట్‌ కోహ్లి గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ మండిపడ్డాడు. పనీపాటా లేని వాళ్లే వదంతులు సృష్టించి జనాల మీదకు వదులుతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు కోహ్లి లేని ప్రపంచకప్‌ జట్టును ఊహించడం కూడా కష్టమన్నాడు.

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2024 భారత జట్టులో కోహ్లికి చోటు ఇవ్వకుండా.. యువకులకు పెద్దపీట వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లి బ్యాటింగ్‌ స్టైల్‌ వెస్టిండీస్‌ పిచ్‌లకు అంతగా సూట్‌ కాదని.. అందుకే ఈ ఢిల్లీ బ్యాటర్‌ను తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి.

టీమిండియా గెలవాలంటే అతడు ఉండాల్సిందే
ఈ విషయంపై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘విరాట్‌ కోహ్లి లేకుండా టీ20 ప్రపంచకప్‌ టీమా? ఛాన్సే లేదు. 2022లో జట్టును సెమీస్‌కు చేర్చిన ఘనత తనది.

ఆ ఎడిషన్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ కూడా అతడే. అలాంటి వ్యక్తికి జట్టులో చోటు ఉండదా? అసలు ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు? వాళ్లకు వేరే పనులేమీ లేవా? నిరాధారపూరిత వ్యాఖ్యలతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు?

ఒకవేళ ఈసారి టీమిండియా గనుక టీ20 వరల్డ్‌కప్‌ గెలవాలంటే విరాట్‌ కోహ్లి కచ్చితంగా జట్టులో ఉండి తీరాల్సిందే’’ అని చిక్కా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా కూడా స్పందించాడు.

సచిన్‌ మాదిరే కోహ్లికి కూడా ఆ గౌరవం దక్కాలి
ఈ మేరకు.. ‘‘వన్డే వరల్డ్‌కప్‌ లేదంటే టీ20 ప్రపంచకప్‌.. ఈవెంట్‌ ఏదైనా.. జట్టును ఒడ్డుకు చేర్చే ఆటగాడు ఉండాల్సిందే. విరాట్‌ కోహ్లి వంటి ఆటగాళ్లు కేవలం జట్టులో ఉంటే చాలు. అన్నీ సజావుగా సాగిపోతాయి.

వందకు వంద శాతం జట్టుకు కోహ్లి అవసరం ఉంది. కోహ్లి కోసం టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్‌ ట్రోఫీ గెలవాలి. 2011లో సచిన్‌ టెండుల్కర్‌కు దక్కిన మాదిరే విరాట్‌ కోహ్లికి కూడా గౌరవం దక్కాలి. అతడికి జట్టు ఇచ్చే గొప్ప కానుక అంతకంటే మరొకటి ఉండదు’’ అని డానిష్‌ కనేరియా పేర్కొన్నాడు.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. ఇకపై

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)