Breaking News

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి విధ్వంసకర వీరుడు ఔట్‌

Published on Thu, 08/29/2024 - 07:22

కరీబియర్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 నుంచి సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు హెన్రిచ్‌ క్లాసెన్‌ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల చేత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు క్లాసెన్‌ ప్రకటించాడు. సీజన్‌ మొత్తానికి తాను దూరంగా ఉండనున్నట్లు క్లాసెన్‌ వెల్లడించాడు. క్లాసెన్‌ వైదొలగడం అతని ఫ్రాంచైజీ సెయింట్‌ లూసియా కింగ్స్‌కు కోలకోలేని ఎదురుదెబ్బ. 

సెయింట్‌ లూసియా క్లాసెన్‌ స్థానాన్ని న్యూజిలాండ్‌ ఆటగాడు టిమ్‌ సీఫర్ట్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెయింట్‌ లూసియా ఈ ఏడాది జూన్‌లో డ్రాఫ్ట్‌ కంటే ముందు క్లాసెన్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు (2022 ఎడిషన్‌లో) అతను గయానా అమెజాన్‌ వారియర్స్‌కు ఆడాడు. క్లాసెన్‌ రీప్లేస్‌మెంట్‌ అయిన టిమ్‌ సీఫర్ట్‌కు కూడా మంచి టీ20 ట్రాక్‌ రికార్డు ఉంది. సీఫర్ట్‌ 2020లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

మరోవైపు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌ నుంచి మరో స్టార్‌ ఆటగాడు కూడా వైదొలిగాడు. గాయం కారణంగా జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు ప్రకటించాడు. రజా సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండింది. ఆ ఫ్రాంచైజీ రజా స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. 

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌కు మరికొంత మంది స్టార్‌  ఆటగాళ్లు పాక్షికంగా దూరం కానున్నారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌ సీజన్‌ తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరం కానుండగా.. బార్బడోస్‌ రాయల్స్‌ ఆటగాళ్లు డేవిడ్‌ మిల్లర్‌, కేశవ్‌ మహారాజ్‌ సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌లు మిస్‌ కానున్నారు. 

టిమ్‌ డేవిడ్‌ స్థానాన్ని యూస్‌ఏ ఆండ్రియస్‌ గౌస్‌.. డేవిడ్‌ మిల్లర్‌ స్థానాన్ని దునిత్‌ వెల్లలగే.. కేశవ్‌ మహారాజ్‌ స్థానాన్ని షమారా బ్రూక్స్‌ భర్తీ చేయనున్నారు. కాగా, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ రోజు (ఆగస్ట్‌ 29) నుంచి ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లు మరుసటి రోజు ఉదయం ప్రారంభమవుతాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)