Breaking News

కాంతారపై టీమిండియా స్టార్ ప్రశంసల వర్షం.. రిషబ్‌ యాక‌్షన్‌కు ఫిదా

Published on Tue, 10/07/2025 - 14:56

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్‌-1(Kantara: Chapter 1) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసుళ్లు చేసింది. ఈ సినిమాపై  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చేరాడు.

రిషబ్ శెట్టి మ్యాజిక్‌కు రాహుల్ ఫిదా అయిపోయాడు. "ఇప్పుడే కాంతార సినిమా చూశాను. రిషబ్ శెట్టి మరోసారి అద్బుతం సృష్టించాడు. ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని  ప్రతిబింబించిందని" రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

2022లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన కాంతార సీక్వెల్ కూడా తనకు బాగా నచ్చిందని రాహుల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ ఐపీఎల్‌-2025లో కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత తరపున ఆడుతున్నాడు. 

తొలి టెస్టు అనంతరం విశ్రాంతి లభించడంతో కాంతార సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు శుక్రవారం నుంచి ఢిల్లీ వేదిక‌గా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కేఎల్ స‌న్న‌ద్దం కానున్నాడు. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న భార‌త జ‌ట్టు రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌లో పాల్గోనుంది. 

రాహుల్‌ టెస్టు క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. గత పది ఇన్నింగ్స్‌లలో 532 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్‌ 2-2తో డ్రా చేసుకోవడంలో రాహుల్‌ ది కీలక పాత్ర. ఇప్పుడు అదే జోరును విండీస్‌పై కూడా కొనసాగిస్తున్నాడు.
చదవండి: ‘వైభవ్‌ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి పంపండి’
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)