Breaking News

మంచి మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. అధికారిణికి ‘స్మార్ట్‌ ఫోన్’ గిఫ్ట్‌

Published on Sun, 11/08/2026 - 19:30

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ తన మంచి మనసు చాటుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తనకు లభించిన  'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' స్మార్ట్‌ఫోన్ అవార్డును అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా అధికారికి బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. రాహుల్ ఇచ్చిన ఈ బహుమతిపై సదరు మహిళా ఆఫీషియల్ సంతోషం వ్యక్తం చేసింది.

"నాకు రాహుల్ ఫోన్ గిప్ట్‌గా ఇచ్చారు. నిజంగా నేను షాక్ అయ్యాను. అతడిది ఎంతో మంచి మనసు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు" అని ఆమె పేర్కొంది. ఈ వీడియోకు ‘‘ గొప్ప ప్లేయర్.. అంతకంటే గొప్ప మనసు. క్లాస్‌’’ అని బీసీసీఐ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. కాగా కివీస్‌తో జరిగిన లోస్కోరింగ్ గేమ్‌లో రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకానొక దశలో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (30), కేఎల్ రాహుల్ (26 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత భారత్ 113/7 వద్ద ఉన్నప్పుడు వర్షం ప్రారంభమైంది. ఆ సమయానికి డీఎల్‌ఎస్‌ పార్ స్కోరు కంటే 4 పరుగులు ముందంజలో ఉండటంతో విజయం భారత్‌ను వరించింది.


 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)