శతక్కొట్టిన కేఎల్‌ రాహుల్‌.. రాణించిన కరుణ్‌ నాయర్‌, జురెల్‌

Published on Fri, 06/06/2025 - 20:08

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్‌లో ల్యాండైన కేఎల్‌ రాహుల్‌ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇవాళ (జూన్‌ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్‌లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. 

ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌కు జతగా బరిలోకి దిగిన రాహుల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

మరో ఎండ్‌లో జైస్వాల్‌ (17), కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన కరుణ్‌ నాయర్‌ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్‌ ఫామ్‌నే కొనసాగించిన కరుణ్‌ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న వేల క్రిస్‌ వోక్స్‌ అతనికి అడ్డుకట్ట వేశాడు. 

వోక్స్‌ ఓ అద్భుతమైన బంతితో కరుణ్‌ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్‌ ఔటయ్యాక రాహుల్‌ ధృవ్‌ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్‌.. రాహుల్‌తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

55 ఓవర్ల అనంతరం భారత్‌-ఏ స్కోర్‌ 234/3గా ఉంది. భారత్‌-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్‌ వోక్స్‌ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

పాపం సర్ఫరాజ్‌
ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్‌లో సత్తా చాటిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను తప్పించారు. సర్ఫరాజ్‌ తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. రాహుల్‌ ఓపెనర్‌గా రావడంతో కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ మూడో స్థానానికి డిమోట్‌ అయ్యాడు. 

బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్‌ కుమార్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ను బరిలోకి దించారు. అలాగే హర్ష్‌ దూబే స్థానంలో తనుశ్‌ కోటియన్‌ తుది జట్టులోకి వచ్చాడు.  

ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్‌ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)