Breaking News

చివరి టెస్టుకూ కేఎల్‌ రాహుల్‌ దూరం

Published on Fri, 03/01/2024 - 04:25

ధర్మశాల: తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకూ దూరమయ్యాడు. మొదటి నుంచీ అతను ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అందుకే జట్టును ఎంపిక చేసిన సమయంలో ‘ఫిట్‌నెస్‌కు లోబడి’  అంటూ బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. అతను 90 శాతం వరకు కోలుకున్నా... ఇంకా పూర్తి ఫిట్‌ కాకపోవడంతో మ్యాచ్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో మాత్రమే రాహుల్‌ బరిలోకి దిగాడు. ‘రాహుల్‌ ఐదో టెస్టుకు దూరమయ్యాడు.

అతని పరిస్థితిని బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఈ విషయంలో తదుపరి చికిత్సకు సంబంధించి లండన్‌లో ఉన్న వైద్యులతో వారు సంప్రదిస్తున్నారు’ అని బోర్డు పేర్కొంది.  రాంచీ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్‌ బుమ్రా మార్చి 7 నుంచి జరిగే చివరి టెస్టులో బరిలోకి దిగుతాడని బోర్డు ప్రకటించింది. రాహుల్‌ గైర్హాజరులో రజత్‌ పటిదార్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 63 పరుగులే చేసిన పటిదార్‌కు తుది జట్టులో చోటు దక్కేది సందేహమే.

పటిదార్‌ స్థానంలో కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అరంగేట్రం చేసే అవకాశముంది. టీమ్‌తో ఉన్న ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను బీసీసీఐ విడుదల చేసింది. రేపటి నుంచి ముంబైతో జరిగే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు తరఫున అతను బరిలోకి దిగుతాడు. లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న పేసర్‌ షమీ కోలుకుంటున్నాడని... త్వరలోనే జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతని రీహాబిలిటేషన్‌ మొదలవుతుందని బోర్డు వెల్లడించింది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)