Breaking News

భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్‌ కొన్న టీమిండియా స్టార్‌

Published on Thu, 07/18/2024 - 13:25

ఐపీఎల్‌-2024 తర్వాత కేఎల్‌ రాహుల్‌ టీమిండియాకు దూరమయ్యాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు.. టీ20 ప్రపంచకప్‌-2024 జట్టులో చోటు దక్కలేదు.

అయితే, తాజాగా శ్రీలంకతో జరుగనున్న దైప్వాక్షిక సిరీస్‌తో కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేయడం దాదాపుగా ఖాయమైంది. అంతేకాదు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ పర్యటనకు దూరమైతే వన్డే జట్టుకు కెప్టెన్‌గానూ ఈ కర్ణాటక బ్యాటర్‌ వ్యవహరించనున్నాడు.

జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్‌ మొదలుకానుండగా.. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది భారత్‌. అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది. ఇదిలా ఉంటే కేఎల్‌ రాహుల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.

ఈ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్‌ బాంద్రాలో విలాసంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇందుకోసం రాహుల్‌- అతియా జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వెస్ట్‌ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్‌ కోసం రూ. 1.20 కోట్ల స్టాంప్‌ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇక ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ సైతం ఫ్లాట్‌ కలిగి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా షారుఖ్‌ ఖాన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, జాన్వీ కపూర్‌, త్రిప్తి డిమ్రి కూడా ఇక్కడ నివాసాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ తన కథనంలో వివరాలను వెల్లడించింది. కాగా భారత క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుల్లో ఒకడైన కేఎల్‌ రాహుల్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో గ్రేడ్‌-ఏ జాబితాలో ఉన్నాడు.

తద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు. మ్యాచ్‌ ఫీజులు ఇందుకు అదనం. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ కేఎల్‌ రాహుల్‌కు భారీ మొత్తమే సంపాదిస్తున్నాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా సీజన్‌కు రూ. 17 కోట్ల మేర అందుకుంటున్నట్లు సమాచారం. ఇక అతియా శెట్టి.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి కుమార్తె అన్న విషయం తెలిసిందే. నటిగానూ ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)