Breaking News

నా వ‌ల్లే అలా జ‌రిగింది.. పంత్‌ను ఏమి అనొద్దు: కేఎల్‌ రాహుల్‌

Published on Sun, 07/13/2025 - 11:48

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులు చేయ‌గా.. టీమిండియా సైతం సరిగ్గా 387 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్‌పై భార‌త్ ఆధిప‌త్యం చెలాయించింది.

కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్‌ను కోల్పోవ‌డంతో క‌థ తారుమారైంది. అనవ‌స‌రంగా ర‌నౌట్ అయ్యి ఇంగ్లండ్‌కు త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్‌, పంత్ మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం వ‌ల్ల భార‌త్ వికెట్ కోల్పోవ‌ల్సి వ‌చ్చింది.

అయితే లేని ప‌రుగు కోసం పంత్ ప్రయ‌త్నించి ర‌నౌట‌య్యాడు అని చాలా మంది విమ‌ర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్య‌త‌ను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్‌కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అన‌వ‌స‌ర ర‌నౌట్‌కు అవుట్‌కు దారితీసిందని వెల్లడించాడు.

"ఈ మ్యాచ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచ‌రీ సాధిస్తాన‌ని నేను  పంత్‌తో చెప్పాను. బ‌షీర్ లంచ్ బ్రేక్‌కు ముందు చివ‌రి ఓవ‌ర్ వేయ‌డంతో సెంచ‌రీ చేయ‌డానికి మంచి అవకాశం భావించాను.

అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ దుర‌దృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవ‌ర్‌లో తొలి బంతికి బౌండరీ బాదే అవ‌కాశ‌ముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవ‌లం సింగిల్ మాత్ర‌మే ల‌భించింది. 

దీంతో పంత్ మ‌ళ్లీ న‌న్ను స్ట్రైక్‌లోకి తీసుకురావాల‌న‌కున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్ర‌య‌త్నించాడు. ఈ ప్ర‌య‌త్నంలో అత‌డు ర‌నౌట్ అవ్వాల్సి వ‌చ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాట‌ర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాల‌ని అనుకోరు. ఏదేమైనా ఆ ర‌నౌట్ మా మూమెంట‌మ్‌ను దెబ్బ‌తీసింది. ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో పేర్కొన్నాడు. 

ఆ త‌ర్వాత షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లోనే రాహుల్‌ 177 బంతుల్లో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసిఔట‌య్యాడు. ఈ క‌ర్ణాట‌క ఆట‌గాడు రిషబ్ పం‍త్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై రాహుల్‌ సూపర్‌ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్‌

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)