Breaking News

'ఫ్లైట్‌ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'

Published on Sat, 07/29/2023 - 15:36

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్‌ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్‌ పూరన్‌ సారధ్యంలోని ముంబై న్యూయార్క్‌ టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్‌ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్‌ ఓర్కాస్‌, ముంబై న్యూయార్క్‌లు తలపడనున్నాయి. 

కాగా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్లు కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్‌కు పొలార్డ్‌ కెప్టెన్‌గా ఉంటే.. టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ముంబై న్యూయార్క్‌.. టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్‌.. ''ఇక నువ్వు ఫ్లైట్‌ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్‌ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్‌లు ఒకరినొకరు హగ్‌ చేసుకొని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Japan Open 2023: భారత్‌ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్‌ ఓటమి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)