Breaking News

చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Tue, 06/24/2025 - 11:49

వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 700 మ్యాచ్‌లు ఆడిన ఏకైక  ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పొలార్డ్ ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో ఎంఐ న్యూయర్క్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మంగళవారం  డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, ఎంఐ న్యూయర్క్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆడేందుకు మైదానం‍లోకి అడుగుపెట్టిన పొలార్డ్‌.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల పొలార్డ్‌ 2006లో ట్రినిడాడ్ & టొబాగో తరపున టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 

ఆ తర్వాత వెస్టిండీస్‌తో పాటు ఐపీఎల్‌, సీపీఎల్‌, బీబీఎల్‌, బీపీఎల్‌, అబుదాబి టీ20, టీ10 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో 2010 నుంచి 2022కు ముంబై ఇండియన్స్‌కు ఈ కరేబియన్ దిగ్గజం ప్రాతనిథ్యం వహించాడు.

2023 సీజన్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్‌.. ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాప్‌లో చేరాడు. ఇప్పటివరకు 700 టీ20లు ఆడిన పొలార్డ్‌.. 13,634 పరుగులతో పాటు 326 వికెట్లు పడగొట్టాడు. కాగా అత్య‌ధిక టీ20లు ఆడిన జాబితాలో పొలార్డ్ త‌ర్వాత స్ధానంలో డ్వైన్ బ్రావో(582), షోయ‌బ్ మాలిక్‌(557) ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  ఎంఐ న్యూయర్క్‌పై 47 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 246 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

శాన్ ఫ్రాన్సికో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (43 బంతుల్లో 91 పరుగులు), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (26 బంతుల్లో 64 పరుగులు) హాఫ్ సెంచ‌రీల‌తో స‌త్తాచాటారు. అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో న్యూయ‌ర్క్ 199 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది.
చదవండి: IND vs ENG: 'అత‌డిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్‌ రెడ్డి వంద రెట్లు బెట‌ర్‌'
 

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు