Breaking News

భారత్‌ ‘ఖో ఖో’ కూత పాక్‌తో షురూ

Published on Thu, 12/19/2024 - 03:56

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భారత్‌ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్‌లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్‌ సీఈఓ విక్రమ్‌ దేవ్‌ డోగ్రా తెలిపారు. 

బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్‌ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్‌ ఫైనల్స్‌ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంతో పాటు గ్రేటర్‌ నోయిడాలోని ఇండోర్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

ఈ టోర్నీ కోసం జవహర్‌లాల్‌ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్‌కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్‌ చెప్పారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఈ మెగా ఈవెంట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)