Breaking News

Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం

Published on Sun, 02/05/2023 - 05:08

సాక్షి, హైదరాబాద్‌: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్‌ బాలుర ట్రిపుల్‌ జంప్‌లో తెలంగాణ ప్లేయర్‌ కొత్తూరి ప్రణయ్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్‌ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

శనివారం జరిగిన జూనియర్‌ పురుషుల సైక్లింగ్‌ కెరిన్‌ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్‌ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్‌–19 బాలుర సింగిల్స్‌ విభాగంలో కె.లోకేశ్‌ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్‌ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్‌ ఠాకూర్‌ (పంజాబ్‌)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్‌... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. 

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)