Breaking News

ఒలింపిక్స్‌ టార్చ్‌ బేరర్‌గా దివ్యాంగుడు..పక్షవాతంతో కాళ్లు పడిపోయినా..!

Published on Wed, 07/24/2024 - 11:06

ఫ్రాన్స్‌కు చెందిన కెవిన్‌ పియెట్‌ అనే దివ్యాంగ టెన్నిస్‌ క్రీడాకారుడు పారిస్‌ ఒలింపిక్స్‌లో టార్చ్‌ బేరర్‌గా నిలిచాడు. 35 ఏళ్ల కెవిన్‌ 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ల స్పర్శను కోల్పోయాడు. పక్షవాతం కారణంగా కెవిన్‌ రెండు కాళ్లు పని చేయడం లేదు. కెవిన్‌.. తాను సొంతంగా నడవలేకపోయినా రోబిటిక్‌ యంత్రం (Exoskeleton) సాయంతో నడుస్తూ ఒలింపిక్స్‌ జ్యోతిని మోసాడు. 

ఎక్సోస్కెలిటన్‌ సాయంతో టార్చ్‌ బేరర్‌గా నిలవడం ఒలింపిక్స్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. కెవిన్‌ పక్షవాతం బారిన పడ్డాక పారా అథ్లెట్‌గా (వీల్‌ చైర్‌ టెన్నిస్‌) కొనసాగుతున్నాడు. కెవిన్‌ ఎక్సోస్కెలిటన్‌ సాయంతో తన రోజువారీ పనులు తానే చేసుకోవడంతో పాటు టెన్నిస్‌లో తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దివ్యాంగ క్రీడాకారులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడే సైబాథ్లాన్‌ పోటీల్లోనూ కెవిన్‌ పాల్గొన్నాడు.

కాగా, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జులై 26న జరిగే ఓపెనింగ్‌ సెర్మనీతో విశ్వ క్రీడలు మొదలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 206 దేశాల నుంచి 10, 714 క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. ఆగస్ట్‌ 10న విశ్వ క్రీడలు ముగుస్తాయి. 32 క్రీడలకు సంబంధించి 329 విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయి. 

భారత్‌ నుంచి ఈ సారి ఒలింపిక్స్‌లో 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత బృందానికి టార్చ్‌ బేరర్లుగా పీవీ సింధు, శరత్‌ కమల్‌ వ్యవహరించనున్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత ప్రస్తానం రేపటి నుంచి జరుగబోయే ఆర్చరీ పోటీలతో మొదలవుతుంది. జులై 27న బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌.. ఆగస్ట్‌ 1-10 వరకు అథ్లెటిక్స్‌.. జులై 27- ఆగస్ట్‌ 8 వరకు హాకీ పోటీలు, జులై 27- ఆగస్ట్‌ 5 వరకు షూటింగ్‌ పోటీలు జరుగనున్నాయి. 
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)