Breaking News

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా కేపీ..?

Published on Thu, 01/16/2025 - 15:41

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ కోసం​ అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

44 ఏళ్ల కెవిన్‌ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్‌.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్‌ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.

తన కెరీర్‌లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.

2009 నుంచి 2016 వరకు ఐపీఎల్‌ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఏడు వికెట్లు కూడా తీశాడు.

రిటైర్మెంట్‌ అనంతరం కేపీ వివిధ క్రికెట్‌ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాలో యాషెస్‌ సిరీస్‌ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత​ పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్‌లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.

కాగా, ప్రస్తుతం భారత కోచింగ్‌ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్‌ గంభీర్‌ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్‌ బౌలింగ్‌ కోచ్‌గా, టి దిలీప్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్‌ టెన్‌ డస్కటే, అభిషేక్‌ నాయర్‌ అసిస్టెంట్‌ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్‌ కోచ్‌ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని భారత్‌ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ మాత్రమే గెలిచిన భారత్‌ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్‌ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ప్రిపేర్‌ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా​)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్‌)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్‌)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్‌)

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ షెడ్యూల్‌..
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్‌ (దుబాయ్‌)
ఫిబ్రవరి 23- పాకిస్తాన్‌ (దుబాయ్‌)
మార్చి 2- న్యూజిలాండ్‌ (దుబాయ్‌)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)