Breaking News

WC Qualifier 2023: జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్‌

Published on Fri, 05/12/2023 - 13:00

భారత్‌ వేదికగా జరగననున్న వన్డే ప్రపంచకప్‌-2023కు వెస్టిండీస్‌ జట్టు నేరుగా అర్హత సాధించకపోయిన సంగతి తెలిసిందే. జూన్‌లో జింబాబ్వే వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌ క్వాలిఫియర్‌ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో క్వాలిఫియర్‌ రౌండ్‌ మ్యాచ్‌లకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది.

ఈ జట్టుకు బ్రాండెన్‌ కింగ్‌ సారధ్యం వహించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాది తర్వాత ఆ జట్టు ఆల్‌రౌండర్‌ కీమో పాల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్‌ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఈ జట్టులో విధ్వంసకర ఆటగాడు షెమ్రాన్‌ హెట్‌మైర్‌కు చోటు దక్కపోవడం గమానార్హం.

ఇక వరల్డ్‌కప్‌ క్వాలిఫియర్‌ జట్టుతో పాటు యూఏఈతో వన్డే సిరీస్‌కు కూడా జట్టును విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్‌-2023లో భాగంగా ఉన్న విండీస్‌ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ సిరీస్‌ ఆరంభసమయానికి ఐపీఎల్‌ పూర్తి అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని విండీస్‌ సెలక్టర్లు నిర్ణయించారు.  ఈ సిరీస్‌ జూన్‌ 5 నుంచి ప్రారంభం కానుంది.

ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్ (వైస్‌ కెప్టెన్‌), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్

యూఏఈ వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్‌), బ్రాండన్ కింగ్ (వైస్‌ కెప్టెన్‌), అలిక్ అథానాజ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, కావెం హాడ్జ్, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రేమోన్ రీఫెర్, ఓడియన్ స్మిత్, డెవాన్ థామస్
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)