Breaking News

సెలక్టర్లకు వార్నింగ్‌.. మళ్లీ శతక్కొట్టిన టీమిండియా స్టార్‌

Published on Sat, 11/01/2025 - 16:07

రంజీ ట్రోఫీ-2025 సీజన్‌లో టీమిండియా వెటరన్‌, కర్ణాటక స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్న నాయర్‌.. మరో అద్బుతమైన ఫస్ట్ క్లాస్‌ సెంచరీతో చెలరేగాడు.

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ నాయర్ శతక్కొట్టాడు. కేవలం 163 బంతుల్లోనే తన 26వఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అతడు అందుకున్నాడు. నాయర్ ప్రస్తుతం 116 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 

గత కొంతకాలంగా విదర్భ తరఫున ఆడిన కరుణ్ నాయర్..  ప్రస్తుత రంజీ సీజన్‌లో తన సొంత జట్టు కర్ణాటకకు తిరిగి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  సౌరాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన నాయర్‌(73).. ఆ తర్వాత గోవాతో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం(174)తో కదం తొక్కాడు. ఇప్పుడు కేరళపై కూడా మూడంకెల స్కోరును అందుకున్నారు.

కరుణ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?
కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాయ‌ర్‌.. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో కేవ‌లం ఒక్క హాఫ్ సెంచ‌రీ మాత్ర‌మే ఉంది.

దీంతో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి సెల‌క్ట‌ర్లు తొలగించారు. అతడి స్థానంలో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు అవకాశం కల్పించారు. అయితే జ‌ట్టు నుంచి తొలగించడంపై కరుణ్ నాయర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఒక సిరీస్ కంటే ఎక్కువ అవకాశాలకు అర్హుడిని అని చెప్పుకొచ్చాడు. మ‌ళ్లీ టీమిండియాలోకి వ‌స్తానిని ఈ క‌ర్ణాట‌క బ్యాట‌ర్ థీమా వ్య‌క్తం చేశాడు.
చదవండి: ENG vs NZ: ఇంగ్లండ్‌కు ఘోర ప‌రాభ‌వం.. 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)