Breaking News

భీకర ఫామ్‌లో కరుణ్‌ నాయర్‌.. మరో మెరుపు ఇన్నింగ్స్‌

Published on Wed, 08/28/2024 - 06:59

బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్‌ వారియర్స్‌ సారథి కరుణ్‌ నాయర్‌ భీకర ఫామ్‌ కొనసాగుతుంది. ఈ టోర్నీలో నాయర్‌ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 426 పరుగులు చేశాడు. తాజాగా హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ​్‌లో కరుణ్‌ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. 

కరుణ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ సాయంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో కొదండ కార్తీక్‌ (30), కార్తీక్‌ (29), సుచిత్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టైగర్స్‌ బౌలర్లలో ఎల్‌ఆర్‌ కుమార్‌, మాధవ్‌ ప్రకాశ్‌ బజాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరియప్ప, రిషి బొపన్న చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్‌.. వారియర్స్‌ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 18.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. శ్రీవత్సవ. సుచిత్‌. ధనుశ్‌ గౌడ, మనోజ్‌ భాంగడే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్‌, దీపక్‌ దేవడిగ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్‌ తాహా (33) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మనీశ్‌ పాండే (14), శ్రీజిత్‌ (13), అనీశ్వర్‌ గౌతమ్‌ (11), కరియప్ప (11), ఎల్‌ఆర్‌ కుమార్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)