భారత ట్రిపుల్‌ సెంచరీ వీరుడి కీలక నిర్ణయం.. ఇకపై ఇంగ్లండ్‌లో

Published on Sat, 09/09/2023 - 20:19

టీమిండియా ఆటగాడు కరుణ్‌ నాయర్‌ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడేందుకు నాయర్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో నార్తాంప్టన్‌షైర్‌కు కరుణ్‌ నాయర్‌ ప్రాతినిథ్యం వహించనున్నాడు.

ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్‌మన్ స్థానంలో కరుణ్‌ నాయర్‌ నార్తాంప్టన్‌షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్‌షైర్ జట్టుతో నాయర్‌ చేరాడు.  ఆదివారం వార్విక్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌తో నాయర్‌ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

ట్రిపుల్‌ సెంచరీతో అదరగొట్టి..
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నాయర్‌.. అరంగేట్ర సిరీస్‌లోనే డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్‌ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్‌ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్‌.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)