ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
అతడిలో సచిన్, కోహ్లి కనిపిస్తున్నారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: కపిల్ దేవ్
Published on Sat, 07/04/2026 - 17:17
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులతో దిగ్గజ క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్‌కు జట్టుతో పాటు ఉన్నప్పటికి డెబ్యూ చేసే అవకాశం రాలేదు.
ఇప్పుడు కనీసం ఇంగ్లండ్ టూర్‌లోనైనా 15 ఏళ్ల సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ భారత మాజీ కెప్టెన్, లెజెండ్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయి ప్రతిభ కనిపిస్తోందని ఆయన అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అతడి టాలెంట్‌ను చూసి అవకాశమివ్వాలని కపిల్ సూచించారు.
"వైభవ్‌కు సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి అంతటి ప్రతిభావంతుడు. ఈ యువ ఆటగాడు టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడు. ప్రపంచంలో ఇలాంటి రేర్ టాలెంట్ ఉన్నవాళ్లు ఒక శాతం కూడా ఉండరు.
ఇంత చిన్న వయస్సులో ఈ తరహా బ్యాటింగ్ చేయడం నిజంగా అద్భుతం. అయితే మిగిలిన ఫార్మాట్లలో అతడు తనని తాను ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. అతడు టెస్ట్ క్రికెట్లో వరుసగా ఐదు ఓవర్ల పాటు మెయిడెన్లు ఆడగలడా? అనేది చూడాలి. నేను ఇప్పటివరకు పెద్దగా అతడి ఆట చూడలేదు.
కానీ ఎక్కడకు వెళ్లినా అతడి గురించే చర్చనడుస్తోంది. ఈ యువ ఆటగాడిపై ఇప్పుడే అతిగా హైప్ క్రియేట్ చేస్తాన్నమని నాకనిపిస్తోంది. అతడిపై అనవసర ఒత్తిడి క్రియేట్ చేయకూడదు. ఈ వయసులో అంతటి అవగాహన ఉండదు. అతడికి కొంత సమయం ఇవ్వాలి.
అయితే సచిన్ కూడా దాదాపు ఇదే వయస్సులో(16) అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటిలో మేము కూడా ఇంత చిన్న వయస్సు ప్లేయర్ ఆడించి తప్పు చేస్తాన్నామా? అని అనుకున్నాం. కానీ గత చరిత్రను పరిశీలిస్తే.. టాలెంట్ ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదని అర్థమవుతుంది. అందుకే వైభవ్‌ను వయస్సు బట్టి కాకుండా టాలెంట్‌ను చూసి జట్టులోకి తీసుకోవాలని" కపిల్ దేవ్ పేర్కొన్నారు.
చదవండి: IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్!
Tags : 1