Breaking News

‘ఆ ఇద్ద‌రూ లెజెండ్స్‌.. వారి స్ధానాల‌ను ఎవరూ భ‌ర్తీ చేయ‌లేరు'

Published on Thu, 07/18/2024 - 09:24

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 విజ‌యనంత‌రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లిలు అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరిద్ద‌రూ టీ20ల‌కు విడ్కోలు ప‌లికిన‌ప్ప‌ట‌కి.. పొట్టి ఫార్మాట్‌లో త‌మ‌కంటూ  ఓ ప్ర‌త్యేక స్ధానాన్ని ఏర్ప‌రచుకున్నారు.

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్ద‌రూ టాప్‌-2లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో 'రోకో' ద్వ‌యంపై భార‌త మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. టీ20ల్లో విరాట్‌, రోహిత్ స్ధానాల‌ను ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని కపిల్ దేవ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మల స్ధానాల‌ను ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. టీ20ల్లో మాత్రం కాదే ఇత‌ర ఫార్మాట్‌లో కోహ్లి, రోహిత్ లాంటి ఆట‌గాళ్లు మ‌రి రారు. భార‌త క్రికెట్‌కు చాలా ఏళ్ల నుంచి వారు త‌మ సేవ‌ల‌ను అందిస్తున్నారు. నిజంగా ఇది వారికి ఘ‌న‌మైన విడ్కోలు. కానీ టీ20ల్లో వారిద్ద‌రి లేని క‌చ్చితంగా భార‌త జ‌ట్టులో క‌న్పిస్తోంది. 

సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిల మాదిరిగానే వీరిద్దరి పేర్లు కూడా భారత క్రికెట్ చిరస్మణీయంగా నిలిచిపోతాయని ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. 

కాగా టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత విరాట్‌, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనకు వీరిద్దరి అందుబాటుపై ఇంకా సందిగ్థం నెలకొంది. శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది.
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)