'అతడు ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌.. చాలా గర్వంగా ఉంది'

Published on Tue, 09/19/2023 - 07:22

ఆసియాకప్‌-2023ను రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 302 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన గిల్‌.. ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. కాగా గిల్‌ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్‌ సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్‌ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు.

ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్‌ను ఫ్యూచర్‌ ఆఫ్‌ భారత్‌ క్రికెట్‌ అని కపిల్‌ దేవ్‌ అభివర్ణించాడు. "శుబ్‌మన్‌ గిల్‌ ఒక అద్భుతం. అతడు భారత్‌ క్రికెట్‌ భవిష్యతు. ఈ యువ క్రికెటర్‌ కచ్చితంగా భారత క్రికెట్‌ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.
చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌.. అశ్విన్‌ రీఎంట్రీ

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)