Breaking News

విలియమ్సన్‌ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Published on Mon, 02/10/2025 - 20:29

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో న్యూజిలాండ్ అద‌ర‌గొడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా లహోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది.

305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో బ్లాక్‌ క్యాప్స్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ విల్‌ యంగ్‌(19) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson) కాన్వేతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు  187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విలియమ్సన్‌(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్‌) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. డెవాన్‌ కాన్వే(97) తృటిలో శతకం సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సేనురన్ ముత్తుసామి రెండు వికెట్లు పడగొట్టగా.. బాష్‌, ముల్డర్‌ తలా వికెట్‌ సాధించారు.

మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంస‌క‌ర సెంచరీ
ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో అరంగేట్ర ఆట‌గాడు మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు.

త‌ద్వారా అరంగేట్రంలో 150 రన్స్‌ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అత‌డితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, ఓ రూర్క్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్‌ ఓ వికెట్‌ సాధించాడు. కాగా ఈ సిరీస్‌లో కివీస్‌కు ఇదే రెండో విజయం. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ గెలుపొందింది.
చదవండి: ఆసీస్‌, భార‌త్, ఇంగ్లండ్‌ కాదు.. ఆ జ‌ట్టు చాలా డేంజ‌ర‌స్‌: రవి శాస్త్రి

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)