చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Breaking News
విలియమ్సన్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
Published on Thu, 09/23/2021 - 13:42
Kane Williamson Taken Wonderful Catch: దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ఓటమి చెందినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆధ్బతమైన క్యాచ్‌తో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ పృథ్వీ షా వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ షాను కేన్ విలియమ్సన్ ఆధ్బతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరుకోగా, సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.
చదవండి: Shreyas Iyer: ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ఇప్పుడు కూడా
— Simran (@CowCorner9) September 22, 2021
Tags : 1