Breaking News

ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రీలంక సంచలన బ్యాటర్‌

Published on Mon, 04/08/2024 - 15:14

2024, మార్చి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్‌ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్‌ కమిందు మెండిస్‌ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ మైయా బౌచియర్‌కు దక్కింది. 

పురుషుల విభాగంలో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం ఐర్లాండ్‌ పేసర్‌ మార్క్‌ అదైర్‌, న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌కు లభించింది.

మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లే గార్డ్‌నర్‌, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్‌ పోటీ పడగా.. మైయా బౌచియర్‌ను అవార్డు వరించింది.

మెండిస్‌ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్‌ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం​ విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మైయా బౌచియర్‌  మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్‌ చేసిన స్కోర్‌ (91) ఆమె కెరీర్‌లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 4-1 తేడాతో గెలుచుకుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)