Breaking News

ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ

Published on Tue, 01/20/2026 - 18:06

డబ్ల్యూపీఎల్‌ 2026 ఎడిషన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం​ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. 

యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.

ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్‌ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.

17 ఏళ్ల కమిలిని ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.

వైష్ణవి శర్మతో భర్తీ 
20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్‌-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. 

డబ్ల్యూపీఎల్‌ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్‌ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు చాలా కీలకం.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)