Breaking News

WTC Final 2025: చరిత్ర సృష్టించిన రబాడ

Published on Thu, 06/12/2025 - 08:06

లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (జూన్‌ 11) మొదలైన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతను.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. రబాడ ఈ రికార్డు సాధించే క్రమంలో దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్‌ను (72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు) అధిగమించాడు. తాజా ప్రదర్శన అనంతరం రబాడ ఖాతాలో 332 వికెట్లు (70 టెస్ట్‌ల్లో) ఉన్నాయి.

టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డేల్‌ స్టెయిన్‌ పేరిట ఉంది. స్టెయిన్‌ 93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు తీశాడు. స్టెయిన్‌ తర్వాత షాన్‌ పొలాక్‌ (108 టెస్ట్‌ల్లో 421 వికెట్లు), మఖాయా ఎన్తిని (101 టెస్ట్‌ల్లో 390 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ముత్తయ్య మురళీథరన్‌ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు తీశాడు. షేన్‌ వార్న్‌ (145 టెస్ట్‌ల్లో 708), జేమ్స్‌ ఆండర్సన్‌ (188 టెస్ట్‌ల్లో 704) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

కాగా, ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రబాడ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. రబాడ ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఉస్మాన్‌ ఖ్వాజా, గ్రీన్‌, వెబ్‌స్టర్‌, కమిన్స్‌, స్టార్క్‌ వికెట్లు తీసి ఆసీస్‌ పతనాన్ని శాశించాడు.

రబాడకు (5/51) జన్సెన్‌ (3/49),  కేశవ్‌ మహారాజ్‌ (1/19), మార్క్రమ్‌ (1/5) తోడవ్వడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది (56.4 ఓవర్లలో). తొలి రోజు టీ విరామం కాగానే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 

67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్‌ స్మిత్‌ (66), బ్యూ వెబ్‌స్టర్‌ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మరోసారి పేకమేడలా కూలింది. 

మధ్యలో అలెక్స్‌ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్మిత్‌, వెబ్‌స్టర్‌, క్యారీ కాక లబూషేన్‌ (17), ట్రవిస్‌ హెడ్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా 20 బంతుల డకౌట్‌ కావడంతో ఆసీస్‌ పతనం మొదలైంది.

ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్‌ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్‌ గ్రీన్‌ (4) దారుణంగా విఫలమయ్యాడు.  స్టీవ్‌ స్మిత్‌ను మార్క్రమ్‌, క్యారీని కేశవ్‌ మహారాజ్‌.. హెడ్‌, లియోన్‌ను (0) జన్సెన్‌ ఔట్‌ చేశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్‌లోనే మార్క్రమ్‌ను స్టార్క్‌ డకౌట్‌ చేశాడు. జట్టు స్కోర్‌ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా ప్రమోషన్‌ పొందిన వియాన్‌ ముల్దర్‌ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్‌ కమిన్స్‌కు దక్కింది. 

అనంతరం వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్‌ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)