దిగ్గజ బౌలర్‌ను అధిగమించిన రబాడ

Published on Mon, 08/11/2025 - 13:06

సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబాడ తమ దేశానికే చెందిన దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్‌ను ఓ విషయంలో అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో (ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో) ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డొనాల్డ్‌ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు.

ఈ జాబితాలో షేన్‌ వార్న్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్‌ సౌతాఫ్రికాపై 69 మ్యాచ్‌ల్లో 190 వికెట్లు తీశాడు. వార్న్‌ తర్వాత టాప్‌-5 స్థానాల్లో డేల్‌ స్టెయిన్‌ (ఆసీస్‌పై 49 మ్యాచ్‌ల్లో 127 వికెట్లు), గ్లెన్‌ మెక​్‌గ్రాత్‌ (సౌతాఫ్రికాపై 58 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు), రబాడ (38 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు), డొనాల్డ్‌ (44 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు) ఉన్నారు.

రబాడ ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడతో పాటు క్వేనా మపాకా (4-0-20-4) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది.

టిమ్‌ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్‌ అందించాడు. గ్రీన్‌ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.

అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్‌ (4-0-27-3), డ్వార్షుయిస్‌ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్‌ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రికెల్టన్‌ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడే రాణించాడు. ఈ గెలుపుతో ఆసీస్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్‌ 12న జరుగనుంది.

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)