Breaking News

జ్యోతి సురేఖ జోడీ పసిడి గురి

Published on Sun, 04/13/2025 - 01:52

సెంట్రల్‌ ఫ్లోరిడా: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్‌ యాదవ్‌ (భారత్‌) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్‌ ఐజు–చెన్‌ చియె లున్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్‌ చైనీస్‌ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది. 

తొలి రెండు సిరీస్‌లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్‌లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్‌లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్‌ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది. 

ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)