Breaking News

సత్తా చాటిన ఆంధ్ర అథ్లెట్స్‌.. స్వర్ణం నెగ్గిన జ్యోతి యర్రాజీ

Published on Sat, 06/17/2023 - 13:46

భువనేశ్వర్‌: జాతీయ సీనియర్‌ అంతర్‌రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్‌ జంప్‌లో మల్లాల అనూష గౌడ్‌ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్‌ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది.

మహిళల హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్‌జంప్, జావెలిన్‌ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్‌ విజేతగా నిలుస్తుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)