Breaking News

ప్రెస్ కాన్ఫ్‌రెన్స్‌లో రిపోర్టర్‌కు అమ్మ కాల్‌.. లక్నో కోచ్ ఏమి చేశాడంటే?

Published on Sat, 04/05/2025 - 17:01

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్‌పై గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ మయాంక్ యాద‌వ్ త్వ‌ర‌లోనే పూర్తి  ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. వెన్ను గాయంతో బాధ‌పడుతున్న మయాంక్ ప్ర‌స్తుత బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CoE)లో శ‌ర‌వేగంగా కోలుకుంటున్నాడు.

మ‌రో ప‌ది రోజుల్లో అత‌డు ల‌క్నో జ‌ట్టులో చేరే అవ‌కాశ‌ముంది. ఏప్రిల్ 14న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతడికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనుంది. ఆ పరీక్షలో యాదవ్ ఉత్తీరణత సాధిస్తే.. అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు క్లియరెన్స్ లభించనుంది. ఈ విషయాన్నిసెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వ‌ర్గాలు  ధ్రువీకరించాయి. 

మయాంక్ గాయంపై లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా అప్‌డేట్ ఇచ్చాడు. మయాంక్ 90 శాతం ఫిట్‌నెస్ సాధించాడని, త్వరలోనే తిరిగి వస్తాడని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లాంగర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఈ విలేకరుల సమావేశంలో లాంగర్ తన చర్యతో అందరిని ఆకట్టుకున్నాడు.

అసలేమి జరిగిందంటే?
ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలయ్యే ముందు వాయిస్ రికార్డు కోసం టేబుల్ పై ఉంచిన ఫోన్లలో ఒక ఫోన్ మోగింది. ఓ రిపోర్ట్‌కు తన అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ తీసుకున్న లాంగర్‌. ఎవరి అమ్మ ఫోన్ చేశారు అని అడిగాడు. 

కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. అమ్మా.. అర్ధరాత్రి 12:08 అయింది. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను" అని ఆ రిపోర్టర్ తల్లితో చెప్ని లాంగర్ కాల్ కట్‌చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఇక  గ‌తేడాది సీజ‌న్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మ‌యాంక్ యాద‌వ్‌.. త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అయితే త‌రుచుగా గాయాల బారిన ప‌డ‌డంతో మ‌యాంక్ ఎక్కువ‌గా బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో కేవ‌లం 4 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన యాద‌వ్‌.. 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. గాయాల‌తో స‌త‌మ‌త‌వుతున్న‌ప్ప‌టికి ల‌క్నో మాత్రం అత‌డిపై న‌మ్మ‌కం ఉంచింది. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు రూ.11 కోట్లకు అత‌డిని ల‌క్నో రిటైన్ చేసుకుంది.
చ‌ద‌వండి: IPL 2025 MI Vs LSG: బెడిసికొట్టిన వ్యూహం.. ఏం చేస్తున్నావ్‌ హార్దిక్‌? .. ఆకాశ్‌ అంబానీ రియాక్షన్‌ వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)