Breaking News

ఇంగ్లండ్‌ తిక్క కుదిరింది.. బజ్‌బాల్‌ అప్రోచ్‌కు అదే విరుగుడు

Published on Thu, 06/22/2023 - 17:04

బజ్‌బాల్‌ విధానం అంటూ టెస్ట్‌ క్రికెట్‌లో వేగం పెంచే ప్రయత్నం చేస్తూ, ఇటీవలే ఆసీస్‌ చేతిలో చావు దెబ్బ (యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో ఓటమి) తిన్న ఇంగ్లండ్‌ టీమ్‌ను ఉద్దేశిస్తూ ఆసీస్‌ మాజీ ఓపెనర్‌, మాజీ హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కనబర్చిన సంయమనం ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ పద్ధతికి విరుగుడు అని ఆయన అభిప్రాయపడ్డాడు.

యాషెస్‌ తొలి టెస్ట్‌ ఆఖరి రోజు ఇంగ్లండ్‌ ఆసీస్‌ను తెగ ఇబ్బంది పెట్టిందని, అయితే కమిన్స్‌ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. కమిన్స్‌ తీవ్రమైన ఒత్తిడిలో ఎంతో ఓర్పును, సహనాన్ని ప్రదర్శించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడని.. ఒత్తిడిలో కమిన్స్‌ ప్రదర్శించిన ఆ ఓర్పు,సహనమే ఆసీస్‌ను గెలిపించిందని తెలిపాడు.

కమిన్స్‌కు లయోన్‌ అద్భుతంగా సహకరించాడని, వారిద్దరు ఒత్తిడిని అధిగమించి, తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారని పేర్కొన్నాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా గెలవడం వల్లే ఆసీస్‌ వరల్డ్‌ నంబర్‌ జట్టుగా చలామణి అవుతుందని, ఇందుకు యాషెస్‌ తొలి టెస్ట్‌ ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. బజ్‌బాల్‌కు విరుగుడు ఏమిటనే దానిపై గతంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని.. ఆసీస్‌ కెప్టెన్‌ తొలి టెస్ట్‌లో బంతితో పాటు కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆ ప్రశ్నకు జవాబిచ్చాడని తెలిపాడు.

కాగా, యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో ఆసీస్‌ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. పాట్‌ కమిన్స్‌ (0/59, 38, 4/63, 44 నాటౌట్‌) ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆసీస్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. వికెట్లు చేతిలో ఉన్నా, తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి ఇంగ్లండ్‌ చేతులు కాల్చుకోగా.. తమ ముందు బజ్‌బాల్‌ గిజ్‌బాల్‌ జాన్తానై అంటూ ఆసీస్‌.. ఇంగ్లండ్‌ ఎత్తుగడను తిప్పికొట్టింది. ఛేదనలో కమిన్స్‌ ప్రదర్శించిన ఓర్పు, సంయమనం ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ అప్రోచ్‌ను తుంగలో తొక్కి ఆసీస్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ జూన్‌ 28 నుంచి లార్డ్స్‌ వేదికగా జరుగనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)