Breaking News

లక్నో సూపర్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఓపెనర్‌..?

Published on Mon, 07/10/2023 - 17:48

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ (2024) కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్‌ కోచ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్‌ కాంట్రాక్ట్‌ 2023 సీజన్‌తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్‌ అన్వేషణలో పడింది. 

ఈ పదవి కోసం​ ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్‌ ఆసీస్‌ మాజీ హెడ్‌ కోచ్‌, ఆ జట్టు మాజీ ఓపెనర్‌  జస్టిన్‌ లాంగర్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్‌ కాని, ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్‌ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తుంది. 

ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్‌ నుంచి ఎల్‌ఎస్‌జీ హెడ్‌ కోచ్‌గా లాంగర్‌ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్‌ లాంగర్‌.. ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా, బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. 

ఇదిలా ఉంటే, కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం​ సంజీవ్‌ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా, మోర్నీ మోర్కెల్‌ బౌలింగ్‌ కోచ్‌గా, జాంటీ రోడ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా, విజయ్‌ దాహియా అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)