Breaking News

చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్‌

Published on Sat, 12/06/2025 - 11:30

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌‌లో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.

ఆట చివరి రోజు జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీతో (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో వీరిచిత పోరాటాన్ని చేశారు. ముఖ్యంగా గ్రీవ్స్‌ చేసిన పోరాటం టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. తిమ్మిర్లతో బాధపడుతూ గ్రీవ్స్‌ ఆడిన ఇన్నింగ్స్‌ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది.

37 ఏళ్ల వయసులో రోచ్‌ చేసిన పోరాటాన్ని విస్మరించలేము. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత ఏకంగా 233 బంతుల ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం​ కాదు. అంతకుముందు షాయ్‌ హోప్‌ అద్బుతమైన శతకంతో (140) వీరిలో స్పూర్తి నింపాడు.

72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.

ముఖ్యంగా గ్రీవ్స్‌ ఆటతీరును ఎంత పొగిడినా తక్కువే. ఇతగాడు 565 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి, తన జట్టు మ్యాచ్‌ను కోల్పోకుండా కాపాడాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తిస్తుంది.

ఈ యోధులు ఎదుర్కొన్నది సాధారణ బౌలింగ్‌ గణాన్ని కాదు. మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ లాంటి పేస్‌ బౌలింగ్‌ దిగ్గజాలను, బ్రేస్‌వెల్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను. వీరి తట్టుకొని నాలుగో ఇన్నింగ్స్‌లో అంత భారీ లక్ష్యానికి చేరువ కావడం ఊహకందని గొప్ప విషయం.

ఉనికి కోసం పోరాడుతున్న క్రమంలో..
గత మూడు దశాబ్దాలుగా ప్రభ కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్న విండీస్‌ లాంటి జట్టు నుంచి ఇలాంటి వీరోచిత పోరాటన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఈ జట్టు షాయ్‌ హోప్‌ లాంటి ఆటగాడు ఇస్తున్న స్పూర్తితో ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. 

ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో.. పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించి, పూర్వ వైభవం​ దిశగా సాగుతున్నామన్న సంకేతాలు పంపింది.

సరికొత్త చరిత్ర అయ్యేది
ఈ మ్యాచ్‌ విండీస్‌ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు 500కు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. గత రికార్డు కూడా విండీస్‌ పేరిటే ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

లాథమ్‌, రచిన్‌ శతకాలు
అంతకుముందు టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (466/8) చేసి విండీస్‌ ముందు 531 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీమర్‌ రోచ్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

చెలరేగిన డఫీ
దీనికి ముందు జేకబ్‌ డఫీ ఐదేయడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్‌ (56) రాణించాడు. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.

కలిసికట్టుగా రాణించిన విండీస్‌ బౌలర్లు
విండీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52) ఒక్కడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)