Breaking News

ఒకే గ్రూపులో భారత్, పాక్‌

Published on Sun, 06/29/2025 - 03:54

లుసానే (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వబోయే జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీలో చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో తలపడనున్నారు. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఈ యువ మెగా టోర్నీకి సంబంధించిన డ్రాను తీశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రామ్, హాకీ ఇండియా కార్యదర్శి భోలానాథ్‌ సింగ్, డైరెక్టర్‌ ఆర్‌.కె.శ్రీవాస్తవ పాల్గొన్నారు.  

పూల్‌ ‘బి’లో ఆతిథ్య భారత్‌తో పాటు పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్‌ జట్లున్నాయి. ముందెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 24 జట్లు ప్రపంచకప్‌ బరిలో ఉన్నాయి. ఈ జట్లను ఆరు పూల్స్‌గా విభజించారు. ఒక్కో పూల్‌లో నాలుగు జట్లున్నాయి. భారత్‌లోని చెన్నై, మదురై వేదికల్లో ఈ నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 10 వరకు జూనియర్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. జర్మనీ డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ పూల్‌ ‘ఎ’లో ఉంది. 

గత 2023 ప్రపంచకప్‌ ఫైనల్లో జర్మనీ 2–1తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. అయితే ఆ టోర్నీలో 16 జట్లే పోటీపడ్డాయి. కానీ ఈ సారి మరో 8 జట్లు కప్‌ కోసం పోటీపడతాయి. హాకీ ఇండియా కార్యదర్శి భోళనాథ్‌ మాట్లాడుతూ ‘ఈ ప్రపంచకప్‌తో భారత్‌లో హాకీ శోభ మరింత పెరగనుంది. మౌలిక వసతుల ఆధునీకరణ, మదురైలోని అధునాతన స్టేడియంలో మ్యాచ్‌లు విజయవంతగా నిర్వహిస్తాం’ అని  అన్నారు.  

ఏ పూల్‌లో ఏ ఏ జట్లు... 
పూల్‌ ‘ఎ’: జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడా, ఐర్లాండ్‌; పూల్‌ ‘బి’: భారత్, పాకిస్తాన్, చిలి, స్విట్జర్లాండ్‌; పూల్‌ ‘సి’: అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్, చైనా; పూల్‌ ‘డి’: స్పెయిన్, బెల్జియం, ఈజిప్టు, నబీబియా; పూల్‌ ‘ఇ’: మలేసియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌; పూల్‌ ‘ఎఫ్‌’: ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, కొరియా, బంగ్లాదేశ్‌.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)