నరాలు తెగే ఉత్కంఠ.. సంచలన విజయం! కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా

Published on Mon, 04/10/2023 - 11:21

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్‌ విజయానికి 29 పరుగులు కావల్సిన నేపథ్యంలో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ.. తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

ఆఖరి బంతికి రింకూ సిక్స్‌ బాదగానే.. కేకేఆర్‌ డగౌట్‌ మొత్తం సంబరాల్లో మునిగి తెలిపోయింది. కేకేఆర్‌ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తమ జట్టు హీరోను భుజాలపై ఎత్తుకుని మరి అభినందిచారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించిన కేకేఆర్‌ కో ఓనర్‌, బాలీవుడ్‌ సీనియర్‌ నటి జుహీ చావ్లా.. తమ జట్టు విజయం సాధించగానే భావోద్వేగానికి లోనైంది.

ఆమె తన భర్త జే మెహతా, కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌తో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న రింకూ ఒక్క ఫోర్‌, 6 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా కేకేఆర్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 14న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2023: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్‌! ఎవరీ రింకూ సింగ్‌?

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)